చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలోని టేకుమంద పంచాయతీలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే మురళీమోహన్ సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రతీ ఇంటికి వెళ్లి, ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం హయాంలో ఏడాది కాలంలో అందించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.