పూతలపట్టు: రోడ్డు ప్రమాదంలో మృతులు వీరే

పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాలెం మండలం శేషాపురం వద్ద శనివారం ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును కారు ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో బెంగళూరు నుంచి తిరుమలకు వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన శ్రీధర్ రావు, లక్ష్మి, నాలుగేళ్ల ఆద్విక మృతి చెందారు. కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన తీరుపై విచారణ జరుగుతోంది.

సంబంధిత పోస్ట్