శనివారం సాయంత్రం పూతలపట్టు నియోజకవర్గం, యాదమరి క్రాస్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం, యాదమరి మండలం మాధవరం ఎస్టీ కాలనీకి చెందిన బాబీ నడుపుతున్న వాహనం బెంగళూరు - చెన్నై జాతీయ రహదారిపై అదుపుతప్పి డివైడర్ను ఢీకొంది. ఈ ఘటనలో యువకుడు గాయపడ్డాడు. వెంటనే స్పందించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ జ్యోతిశ్ కుమార్, గాయపడిన యువకుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.