పూతలపట్టు మండలం, రంగంపేట క్రాస్ ఫ్లైఓవర్ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు నుంచి తిరుపతికి పేషెంట్‌ను తరలిస్తున్న అంబులెన్స్‌ను సర్వీస్ రోడ్డులో వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో అంబులెన్స్ బోల్తా పడటంతో అందులోని పేషెంట్‌తో పాటు వాహనంలో ఉన్నవారంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి.