కాణిపాకంలో మే 5న సంకటహర గణపతి వ్రతం

పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో మే 5న సంకటహర గణపతి వ్రతాన్ని నిర్వహించనున్నట్లు ఈవో పెంచలకిషోర్ బుధవారం తెలిపారు. ఈ వ్రతం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, మళ్లీ 11 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు జరుగుతుంది. రాత్రి 7 గంటలకు స్వర్ణ రథోత్సవం లో స్వామి వారు దర్శనమిస్తారని ఈవో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్