చింతలపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

ఐరాల మండలం, చింతలపల్లి సమీపంలోని ఆరు లైన్ల జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు ఎగువు పాలకొల్లు గ్రామానికి చెందిన సుధా అనే మహిళ ఆస్పత్రిలో ఉన్న తన కొడుకును చూసేందుకు వెళుతుండగా అదే గ్రామానికి చెందిన చందు అనే యువకుడు ఆమెకు తోడుగా వెళ్ళాడు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో చందు అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్ర గాయాల పాలైన సుధా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

సంబంధిత పోస్ట్