తవణంపల్లె: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

తవణంపల్లె సమీపంలో ఉన్న నత్తపుచేనులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దామలచెరువు గ్రామానికి చెందిన చంద్రమౌలి (34) తన పనుల కోసం ద్విచక్రవాహనంపై తవణంపల్లె వచ్చి తిరిగి వెళ్తుండగా, గోల్డెన్ టెంపుల్‌కు వెళ్తున్న కారు అతని వాహనాన్ని ఢీకొట్టింది. ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్