తవణంపల్లి మండలం, కారకంపల్లి రహదారి మలుపు సమీపంలో ఈ నెల 24న టి. పుత్తూరు గ్రామానికి చెందిన చంద్రయ్య ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన ప్రైవేటు బస్సు డ్రైవర్ రవి నిర్లక్ష్యంగా నడపడంతో బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రయ్య తీవ్రంగా గాయపడ్డాడు. అతని భార్య అంజలి సోమవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు తవణంపల్లి ఎస్సై రమేష్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.