తిరుపతి జిల్లా సత్యవేడు పట్టణంలోని కుమ్మరిగుంట, పాపానాయుడు వీధి, దేవాంగపురం, అల్లాస్వామి వీధి తదితర ప్రాంతాల్లో టిడిపి నాయకులు పలువురు శుక్రవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో మండల టిడిపి నాయకులు మురళి( చికెన్ చిన్న) ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు.