పులివెందుల: వర్మీ కంపోస్ట్ ఎరువులతో నాణ్యమైన పంట

పులివెందులలోని స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో గురువారం వర్మీ కల్చర్, వర్మీ కంపోస్ట్ సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించారు. ఈ సందర్భంగాప్రిన్సిపల్ శ్రీనివాసులు వర్మీ కంపోస్ట్ తయారీ, ఉపయోగాలపై విద్యార్థినిలకు అవగాహన కల్పించారు. రైతులు వర్మీ కంపోస్ట్ ఎరువును ఎక్కువగా వాడి నాణ్యమైన పంటలను పండించవచ్చునన్నారు.
కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ బాల నారాయణ, అధ్యాపకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్