పుంగనూరులో ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఆవిర్భావ వేడుకలు

పుంగనూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో ఆవరణంలో శుక్రవారం ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ 74వ ఆవిర్భావ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జెండాను ఆవిష్కరించి ఎర్రజెండా వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు జేఎన్ఆర్ రెడ్డి , కార్య దర్శి జీవి రమణ, వర్కింగ్ అధ్యక్షుడు గంగాధర్, జిల్లా జాయింట్ కార్య దర్శి జి. ఎన్. రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్