పుంగనూరు టౌన్ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో గల మహా కాలభైరవ స్వామికి శ్రావణ మాస అష్టమి సందర్భంగా శుక్రవారం రాత్రి విశేష రుద్రాభిషేకం నిర్వహించారు. పసుపు, కుంకుమ, విభూది, గంధాలతో అభిషేకం చేశారు. అనంతరం పుష్పాలతో స్వామివారిని శోభాయ మానంగా అలంకరించారు. మహామంగళహారతి సమర్పించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు, తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.