బంగారుపాల్యం: జర్నలిస్టులపై దాడిని అందిస్తూ పుంగనూరులో నిరసన

బంగారుపాల్యంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ శివకుమార్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ పుంగనూరులో ఏపీడబ్ల్యూజేఎఫ్, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ కూడలి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నినాదాలతో ర్యాలీగా వెళ్లి, ఎమ్మార్వో రాము కు వినతిపత్రం అందజేశారు. దాడి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్