పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం బూరగపల్లె గ్రామస్థులు శనివారం రాత్రి చౌడేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. గత నెల 29న అదృశ్యమైన మైనర్ బాలికను బీటెక్ విద్యార్థితో కలిసి బెంగళూరులో గుర్తించి తీసుకువచ్చారు. అయితే, ఈ విషయంలో ఎస్సై తమపై ఆగ్రహం వ్యక్తం చేశారని బాలిక బంధువులు ఆరోపిస్తూ స్టేషన్ ముందు భారీగా నిరసన తెలిపారు.