చౌడేపల్లి: గడ్డి మందు తాగిన వ్యక్తి మృతి

చౌడేపల్లి మండలం చిన్న ఎల్లకుంటకు చెందిన గుర్రప్ప (55) తాగుడుకు బానిసగా మారాడు. భార్య మందలించడంతో మనస్థాపానికి గురై వారం క్రితం పొలంలో గడ్డి మందు తాగాడు. అపస్మారక స్థితిలో రుయా ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ నాగేశ్వరరావు తెలిపారు.

సంబంధిత పోస్ట్