స్కూటర్ బోల్తా పడి వ్యక్తికి గాయాలైన సంఘటన శుక్రవారం చౌడేపల్లిలో జరిగింది. స్థానికుల వివరాల మేరకు మండలంలోని పంచాయతీ కేంద్రం చారాలకు చెందిన ఉత్తరాది రమణ గ్రామానికి సమీపంలోని సచివాలయం వద్దకు తన టు వీలర్ పై బయలుదేరాడు. ఈ నేపథ్యంలో జంగాలపల్లి క్రాస్ వద్ద స్కూటర్ అదుపుతప్పి కిందకు పడింది. ఈ ఘటనలో రమణకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డా వ్యక్తిని 108 వాహనంలో మదనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు.