చిత్తూరు మహిళా పోలీస్ స్టేషన్ కౌన్సెలింగ్ సెంటర్ స్థాపించి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఎస్పీ మణికంఠ చందోలు శనివారం మీడియాతో మాట్లాడుతూ ఏడాదిలో 482 కుటుంబ సమస్యలను సుళువుగా పరిష్కరించామని తెలిపారు. వాటిలో 52 ఇతర రాష్ట్రాల నుంచి, 3 విదేశాల నుంచి వచ్చిన కేసులుగా పేర్కొన్నారు.