చిత్తూరు: హోంగార్డ్ సురేంద్రబాబు కుటుంబానికి రూ.3.5 లక్షల చెక్కు అందజేత

చిత్తూరు హోం గార్డ్స్ యూనిట్కు చెందిన హోం గార్డ్ బి. సురేంద్ర బాబు విధుల్లో ఉండగానే అనారోగ్యంతో గత ఏప్రిల్ 29న మృతి చెందారు. మృతుని భార్య ఆర్తి కి, జిల్లా ఎస్. పీ. మణికంఠ చందోలు హోం గార్డుల వన్ డే శాలరీ కాంట్రిబ్యూషన్ ఫండ్ నుండి రూ. 3. 5 లక్షల చెక్కును సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమం హోం గార్డ్స్ ఆర్. ఐ. చంద్రశేఖర్ సమక్షంలో జరిగింది. మృతుని కుటుంబానికి అన్ని విధాల సహకారం అందిస్తాం అని తెలిపారు.

సంబంధిత పోస్ట్