ఎన్నికల ముందు చంద్రబాబు 143 హామీలు ఇచ్చి ప్రజలను మోసగించారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. చౌడేపల్లిలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఆదివారం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, టిడిపి, జనసేన కూటమి హామీలను అమలు చేయలేదన్నారు. జగన్ హామీలు నెరవేర్చారని, కూటమి పాలన ఏడాదిలోనే విమర్శలకు లోనైందన్నారు. ప్రజలకు మోసాలు తెలియజేయాలని కోరారు.