అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని బజారు వీధిలో ఉన్న ఆర్యవైశ్య కళ్యాణమండపంలో శనివారం ఏడు శనివారాల పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత మల్లయప్ప స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక మండపంలో కొలువుదీర్చి అభిషేకాలు చేశారు. అర్చకులు ఏడు శనివారాల పూజల విశిష్టత, ఆధ్యాత్మిక ప్రాధాన్యత, పూజా విధానాలను భక్తులకు వివరించారు. భక్తుల చేతులతోనే పూజా కార్యక్రమాలను నిర్వహించారు.