అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలోని సోమల మండలం, రాంపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడు రాంచరణ్ మృతదేహాన్ని బంధువులు పోలీస్ స్టేషన్ ఎదురుగా అంబులెన్స్‌లో ఉంచి బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ధర్నా చేశారు. ఈ నిరసన కారణంగా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.