సోమల ప్రాంతీయ పశు వైద్యశాలను తనిఖీ చేసిన జిల్లా అధికారి

చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమల మండల కేంద్రంలోని ప్రాంతీయ పశు వైద్యశాలను బుధవారం చిత్తూరు జిల్లా పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ ఉమా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా, రైతులతో మాట్లాడుతూ, పేయ్యదూడలను పుట్టించే కార్యక్రమం, పిఎండిఎస్ కార్యక్రమం, మరియు ప్రభుత్వం నుంచి సబ్సిడీ ద్వారా అందే పథకాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సోమల సహాయ సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ నాయుడు, పశు వైద్యాధికారి డాక్టర్ చందన ప్రియ, పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్