పుంగనూరు నుంచి తిరువన్నామలైకి గిరి ప్రదర్శన బస్సులు

పుంగనూరు నుంచి తమిళనాడులోని తిరువన్నామలై గిరి ప్రదర్శనకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులను ఆర్టీసీ డిపో ఏర్పాటు చేసింది. గురువారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుంచి 8 బస్సులు బయలుదేరాయి. డిపో మేనేజర్ కె. సి. పావని పూజలు నిర్వహించి బస్సులకు జెండా ఊపారు. ప్రతి నెల పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడంతో వీటిని ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్