పుంగనూరులో దక్షిణామూర్తికి గురు పౌర్ణమి పూజలు

పుంగనూరు పట్టణం ప్రసిద్ధ శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో గురువారం గురుదక్షిణామూర్తికి ప్రత్యేక అభిషేక కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అర్చకులు సుబ్బయ్య దీక్షితులు గణపతి పూజ, పుణ్యవచనం అనంతరం కలశాలకు పుష్పాలతో పూజలు చేసి హారతులు సమర్పించారు. తరువాత పాలు, పెరుగు, చందనం, విభూదితో గురుదక్షిణామూర్తికి అభిషేకం నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్