పుంగనూరు నియోజకవర్గంలోని పీహెచ్‌సీలు, పాఠశాలలు, కళాశాలల్లో సోమవారం ఇంటర్నేషనల్ ఎయిడ్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించి, గ్రామాలు, పట్టణాలలో ర్యాలీలు చేపట్టారు. అధికారులు మాట్లాడుతూ ఎయిడ్స్ పై అవగాహనతో పాటు యవ్వనంలో నైతిక విలువలు, క్రమశిక్షణ పాటించాలని, వ్యాధి లక్షణాలు, నివారణ చర్యల గురించి ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.