శుక్రవారం, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని అంకాలమ్మ కొండ సమీపంలో చిరుత పులి సంచరించినట్లు గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఎఫ్బిఓ ప్రభాకర్ సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి, ప్రజలకు పలు జాగ్రత్తలు సూచించారు. గుంపులుగా వెళ్లాలని, పశువులను పరిసర ప్రాంతాలకు తీసుకెళ్లవద్దని, అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.