మధ్యాహ్న భోజనంలో బల్లి.. విద్యార్థులకు అస్వస్థత

పుంగనూరు పట్టణం నగిరి వీధిలో ఉన్న మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో మధ్యాహ్న భోజనంలో బల్లి పడినట్లు తల్లిదండ్రులు వాపోయారు. పాఠశాలలో మొత్తం 115 మంది వరకు ఉండగా వారిలో 5-6 మందికి వాంతులు, విరేచనాలు కావడంతో వైద్య సిబ్బంది చికిత్స అందిస్తున్నారు. ఇన్‌ఛార్జ్ MEO నటరాజన్ పాఠశాలకు చేరుకొని విచారణ చేపట్టారు. కాగా పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్