కుప్పం డివిజన్ ఉద్యానవన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ)గా పల్లవి బాధ్యతలు స్వీకరించారు. అనంతపురం జిల్లాలో అధికారిగా పని చేసిన ఆమె పదోన్నతిపై కుప్పానికి బదిలీ అయ్యారు. రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తామని, ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రతి రైతుకూ చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంటల సాగు సంబంధిత సలహాల కోసం రైతులు 8886904257 నెంబర్‌కు సంప్రదించవచ్చని ఆమె సూచించారు.