పుంగనూరు పట్టణంలోని ముడేప్ప సర్కిల్ వద్ద గల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పై చెట్టులో నుంచి ఒక భారీ కొమ్మ శనివారం విరిగి పడడంతో ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చి విద్యుత్ సరఫరా ఆగిపోయింది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఇలా జరగడంతో ఒకసారిగా ప్రజలు ఉలిక్కిపడ్డారు. వెంటనే స్థానికులు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం తెలపడంతో విద్యుత్ ఎల్ఐ. కుమార్ మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.