పుంగనూరు నియోజక వర్గం, చౌడేపల్లి మండలం, చిట్టిరెడ్డిపల్లి గ్రామంలో కాపురం ఉంటున్న సతీష్ (25) మనస్థాపం చెంది బుధవారం గడ్డి నివారణ మందు తాగి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో బెంగుళూరులో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. పరిస్థితి విషయమించడంతో సతీష్ మృతి చెందాడు. మృతదేహాన్ని పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది.