పుంగనూరు: అల్లూరిని ఆదర్శంగా తీసుకోవాలి: సుబ్రహ్మణ్యం రాజు

అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో గురువారం రాజు క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో ఎన్జీవో కాలనీలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యుడు సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజును ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజు క్షత్రియ సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్