పుంగనూరు: అక్రమ లే అవుట్లపై అధికారులు చర్యలు తీసుకోవాలి

పుంగనూరు తహసిల్దార్ కార్యాలయంలో శుక్రవారం తహసిల్దార్ రాము అధ్యక్షతన ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీల సమస్యలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బి. నర్సింలు మాట్లాడుతూ, మండల వ్యాప్తంగా అనుమతులు లేని అక్రమ లేఔట్లపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్