పుంగనూరు: పట్టణంలో బుల్లెట్ బైక్ చోరీ

పుంగనూరు పట్టణంలోని నానబాల వీధిలో కాపురం ఉంటున్న లక్ష్మీకాంత్ రెడ్డి బుల్లెట్ బైక్ (ఏపీ 39 హెచ్ 0145) ను బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ద్విచక్ర వాహనాన్ని చుట్టుపక్కల ప్రాంతాలలో వెతికిన ఫలితం లేకపోవడంతో లక్ష్మి కాంత్ గురువారం మధ్యాహ్నం నాలుగు గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్