చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల జడ్పీ బాయ్స్ ఉన్నత పాఠశాలలో పిఎంఎస్ఆర్ ఐ కింద రూ. 15. 58 లక్షలతో నిర్మించిన కెమిస్ట్రీ ల్యాబ్ ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హెచ్ఎం ధనలక్ష్మి మాట్లాడుతూ ల్యాబ్ పరికరాలు ప్రస్తుతానికి కొన్ని వచ్చాయని , ఇంకా రావాల్సి ఉందని అన్నారు. పూర్తిస్థాయిలో పరికరాలు వచ్చిన వెంటనే విద్యార్థులకు ప్రయోగాల ద్వారా విద్యా బోధన చేస్తామన్నారు.