చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ లో నూతనంగా నిర్మిస్తున్న అదనపు తరగతి గదుల నిర్మాణాలను గురువారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి చల్లా బాబు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం నిర్మాణాలలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు.