పుంగనూరులో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. పట్టణంలోని కొత్తయిండ్లులోని శ్రీ షిరిడీ సాయిబాబా మందిరంలో భక్తుల రద్దీ కనిపిస్తోంది. వేకువజామున కాగడహారతి, ధూనిపూజలతో పూజలు ప్రారంభమయ్యాయి. అనంతరం శ్రీ సాయినాథుని మూలవిగ్రహానికి అభిషేకం నిర్వహించి, శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.