పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, కొత్తూరు గ్రామంలో గత నాలుగు రోజుల మునుపు ఏనుగుల దాడిలో మృతి చెందిన రామకృష్ణంరాజు కుటుంబానికి జనసేన నాయకులు అండగా నిలిచారు. ఈ సందర్భంగా వారు గురువారం బాదిత కుటుంబాన్ని పరామర్శించి రూ 40 వేల ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు నాగభూషణం, కోల రామకృష్ణ, కైవారం మురళి , డాక్టర్ హరి నారాయణ, షబ్బీర్, అభిషేక్, అభిరామ్ అష్రఫ్ , సోము తదితరులు పాల్గొన్నారు.