చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలంలోని ఇటుక నెల్లూరు గ్రామంలో శనివారం రాత్రి అంగరంగ వైభవంగా గంగజాతరను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోయకొండ మాజీ చైర్మన్ ఎస్కే రమణారెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన అమ్మవారి శిరస్సును పురవీధులలో మంగళ వాయిద్యాల మధ్య పురవీధులలో ఊరేగింపుగా తీసుకువెళ్లారు. అనంతరం నడివీధిలో నిలిపిన అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలను నిర్వహించారు.