పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాలలో ఉన్న సాయిబాబా ఆలయాలలో గురువారం గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం నుంచి ఆలయాలలో సాయిబాబా విగ్రహాలకు ప్రత్యేక అభిషేకాలను, పూజలను చేశారు. అనంతరం మూలవిరాట్, ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు దర్శనభాగం కల్పించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు.