పుంగనూరు: బోయకొండ గంగమ్మ ఆలయానికి భారీ ఆదాయం

పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని బోయకొండ గంగమ్మ ఆలయానికి ఆదివారం ఒక్కరోజే వివిధ సేవా టికెట్ల ద్వారా రూ. 28 లక్షల ఆదాయం చేకూరినట్టు అధికారులు తెలిపారు. ఈ ఏడాదిలో ఇంత ఆదాయం రావడం ఇదే మొదటిసారి అని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాక కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయంలో విపరీతమైన రద్దీ నెలకొంది.

సంబంధిత పోస్ట్