చిత్తూరు జిల్లా , పుంగనూరు మండలం , నల్లగుంట్ల పల్లి వద్ద శుక్రవారం విద్యుత్ స్తంభాన్ని ద్విచక్ర వాహనం ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పూర్తి వివరాలు స్థానికులు తెలియజేశారు. గాయపడ్డ వ్యక్తి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వలస కార్మికుడు ఉమన్ బారియ( 36)గా గుర్తించారు. బాధితుడి తలకు బలమైన రక్త గాయం కావడంతో 108 వాహనంలో పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.