పుంగనూరు: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

చౌడేపల్లి మండలం, సింగిరిగుంట గ్రామానికి చెందిన వెంకట చలపతి (45) ఆదివారం కుటుంబ సభ్యులతో గొడవపడి, మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే గమనించి పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో, వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికానున్నాయి.

సంబంధిత పోస్ట్