పుంగనూరు నియోజకవర్గం లోని పలు ప్రాంతాలలో శనివారం ఓ మోస్తరుగా వర్షం కురిసింది. ఈ సందర్భంగా గ్రామాలలోని ప్రజలు మాట్లాడుతూ గత వారం రోజులుగా పగటిపూట ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరిగి ఉక్కపోతతో అలమటించిపోయామని తెలిపారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షంతో తాము ఉక్కపోత నుంచి ఉపశమనం పొందామన్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు వేరుశనగ రైతుకు మేలు చేస్తాయని ఆశిద్దాము.