పుంగనూరు: చోరీలకు పాల్పడ్డ వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు

చిత్తూరు జిల్లా, పుంగనూరు మండల పరిధిలోని సచివాలయాలలో ఎల్ఈడీ టీవీలు, బ్యాటరీలను చోరీ చేసిన దొంగల ముఠాను సోమవారం అరెస్టు చేసినట్లు ఎస్సై రమణ తెలిపారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు. మరో ముద్దాయి పరారీలో ఉన్నట్లు తెలిపారు. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై సూచించారు.

సంబంధిత పోస్ట్