సాంకేతిక పరిజ్ఞానంతో వ్యక్తిని కాపాడిన పుంగనూరు పోలీసులు

పుంగనూరు మండలం వనమలదిన్నె గ్రామానికి చెందిన చంద్రశేఖర్ (42) అప్పుల బాధతో మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతను తీసిన సెల్ఫీ వీడియోను కుటుంబ సభ్యులకు పంపడంతో, వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన సీఐ సుబ్బారాయుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, సమీపంలోని జగనన్న కాలనీ వెనుక అటవీ ప్రాంతాన్ని గుర్తించి, ఘటన స్థలానికి చేరుకున్నారు. చాకచక్యంగా వ్యవహరించి, బాధితుడిని కాపాడారు.

సంబంధిత పోస్ట్