పుంగనూరు: కల్పవృక్ష వాహనంపై దర్శనం ఇచ్చిన రాజమన్నార్

అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణ వేంకటరమణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం వేద పండితులు వెంకటేశ్వర స్వామిని రాజమన్నర్ గా అలంకరించి, కల్పవృక్ష వాహనంపై పట్టణ వీధులలో ఊరేగించారు. స్వామివారి పల్లకి ముందు హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ ఉత్సవాలలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్