పుంగనూరు: ఆ పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత రాజశేఖర్ రెడ్డి దే

మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డిదేనని వైయస్ షర్మిల అన్నారు. అన్నమయ్య జిల్లా పుంగనూరులో గురువారం ఆమె మాట్లాడుతూ, ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా ఇక్కడికి వచ్చానని తెలిపారు. ఈ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్ని నాశనం చేయాలని చూస్తోందని ఆమె ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్