పుంగనూరు: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సర్వేయర్

తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిలోని శివాలయం సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. గానుగచింత గ్రామ సచివాలయ సర్వేయర్ మహమ్మద్ సుల్తాన్, పెన్షన్ ఇచ్చేందుకు పీలేరు నుంచి రొంపిచెర్లకు ద్విచక్ర వాహనంలో వస్తుండగా, దట్టమైన మంచు కారణంగా దారి కనిపించక రోడ్డు డివైడర్‌ను ఢీకొన్నారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి ఆయన్ను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్