పుంగనూరు: ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీ

చిత్తూరు జిల్లా, పుంగునూరు మండల పరిధిలోని కంగా నెల్లూరు గ్రామం సమీపంలో శనివారం సాయంత్రం ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గంగా నెల్లూరు నుంచి ప్రసన్నయ్య గారి పల్లెకు వెళుతున్న వంశీ(19)కి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనంలో పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో మదనపల్లె సర్వేజనా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్