పుంగనూరు నియోజకవర్గంలో శుక్రవారం ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల వారోత్సవాలలో భాగంగా ఐక్యత పరుగు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు, ఎన్ఎస్ఎస్ అధికారులు మాట్లాడుతూ, భారతదేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ సమగ్రత కోసం చేసిన కృషిని కొనియాడారు. ఆయన జీవితం అందరికీ ఆదర్శమని కళాశాల అధ్యాపకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.